జయ వీడియోపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ | Sakshi
Sakshi News home page

జయ వీడియోపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌

Published Wed, Dec 20 2017 12:56 PM

CEC Anger over Jayalalitha Video Release  - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీసిన వీడియో బయటకు రావడంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) సీరియస్‌ అయింది. గురువారం ఆర్కే నగర్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల కావడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

వీడియో విడుదల అంశంపై పూర్తి నివేదికను అందజేయాలని తమిళనాడు ఎన్నికల కమిషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. కాగా, జయలలిత వీడియో ప్రసారాలను నిలిపివేయాలని ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పత్రికలు, చానెళ్లను కోరారు. 

మరోవైపు జయ వీడియోపై ఓ పన్నీర్‌సెల్వం వర్గీయులు స్పందించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దినకరన్‌ వర్గం వీడియోను విడుదల చేసిందని ఆరోపించారు. ఇన్ని రోజులుగా వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement